దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా అమలాపురం పట్టణ పరిసర గ్రామాల్లో దుర్గమ్మ ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహర్నవమిని పురస్కరించుకుని అమ్మవార్లను మహిషాసుర మర్ధినిదేవిగా విశేష అలంకారం చేయించారు.

కోనసీమ, అక్టోబరు 1(శ్రీ విష్ణు న్యూస్): దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా అమలాపురం పట్టణ పరిసర గ్రామాల్లో దుర్గమ్మ ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహర్నవమిని పురస్కరించుకుని అమ్మవార్లను మహిషాసుర మర్ధినిదేవిగా విశేష అలంకారం చేయించారు. అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కళ్యాణ దుర్గమ్మ, శ్రీదేవి మార్కెట్ సెంటర్ లోని శ్రీదేవి అమ్మవారు, మెయిన్ రోడ్డులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ వైష్ణవీ కనకదుర్గమ్మ, ఈదరపల్లి వంతెన వద్ద దుర్గా భవానీ అమ్మవార్లను శ్రీ మహిషాసుర మర్ధినిదేవిగా విశేష అలంకారం చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో సిద్దిరెడ్డి ముత్యాలరావు పద్మావతి కుమారులు కిరణ్, శ్రీధర్ లు అమ్మవారిని మహిషాసుర మర్ధినిగా విశేష అలంకారం చేయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోరిన కోర్కెలు నెరవేర్చే అయినవిల్లి సిద్ధి వినాయకుడు..
శ్రీ రాజరాజేశ్వరిదేవిగా దర్శనం..
Read Latest Devotional News and Telugu News
